అట్టహాసంగా ముగిసిన 'హ్యాపీ సండే'

by Nallavelli.Anjaneyulu |

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మార్చి 8 ఆదివారం ప్రారంభమైన 'హ్యాపీ సండే' కార్యక్రమం, ప్రతి ఆదివారం ఉల్లాసంగా, ఉత్సాహంగా నిర్వహిస్తూ జూన్ 7 ఆదివారం అట్టహాసంగా ముగిసిందని నగరపాలక మేయర్ మమత శ్రీనివాస్ అన్నారు.

అట్టహాసంగా ముగిసిన హ్యాపీ సండే
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మార్చి 8 ఆదివారం ప్రారంభమైన 'హ్యాపీ సండే' కార్యక్రమం, ప్రతి ఆదివారం ఉల్లాసంగా, ఉత్సాహంగా నిర్వహిస్తూ జూన్ 7 ఆదివారం అట్టహాసంగా ముగిసిందని నగరపాలక మేయర్ మమత శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక డ్యాన్స్ స్కూల్స్ విద్యార్థుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగ, మ్యాజిక్ షో, కరాటే విన్యాసాలు, చిన్నారుల కూచిపూడి, భరత నాట్యం లాంటి నృత్యాలతో అలరించిందన్నారు. ముఖ్యంగా పట్టణ సీనియర్ సిటిజన్ ఫోరంలోని 70 ఏళ్ల పైబడ్డ వయసున్న సభ్యుల ఫ్లోక్ డ్యాన్సులు, సినీపాటలు ఆకర్షణీయంగా నిలిచాయని మేయర్ అన్నారు. కమిషనర్ రామాంజుల రెడ్డి మాట్లాడుతూ ఈ హ్యాపీ సండే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏడీఈ మురళీమోహన్ రెడ్డి, ఆర్ఐ ఖాజా, నవీన్, కిరణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Next Story