- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RainUpdate : ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న వారం రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం(HMD) పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న వారం రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం(HMD) పేర్కొంది. కాగా రానున్న 48 గంటల్లో సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, గద్వాల్, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షాలతో పాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని కూడా అధికారులు తెలిపారు. మరోవైపు రానున్న మరో 2 గంటల్లో రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్ల, వికారాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడుతుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. సాయంత్రం దాటిన తర్వాత ఈ వర్షాలు రాష్ట్రంలోని మరిన్ని జిల్లాలకు విస్తరించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.






