- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీజేఏసీ సమావేశం.. ఈ సమస్యలపై ప్రధాన చర్చ
ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం సమావేశం విజయవాడలో ఏపీఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం సమావేశం విజయవాడలో ఏపీఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి 28 జిల్లాల ప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో పీఆర్సీ నియామకం, ఐఆర్ ప్రకటన అంశాలతో పాటు ఉద్యోగ సమస్యలపై పలువురు చర్చించారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఐఆర్, పీఆర్సీలను కూడా ప్రకటించాలని కోరారు. లేదంటే ఉద్యోగులను ఉద్యమానికి సిద్ధం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు బొప్పరాజు స్పష్టం చేశారు. దీనిపై 13 మంది సభ్యులతో ఒక కమిటీ కూడా వేశామని, ఆ కమిటీ రేపటి నుంచి పనిచేస్తుందని వివరించారు. వివిధ ఉద్యోగ సంఘాల నాయకులంతా తమకు సపోర్ట్ గా కలిసి వస్తారని కోరుకుంటున్నట్లు బొప్పరాజు తెలిపారు. ఆర్థిక అంశాలపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. మరోవైపు ఏపీఎస్ ఆర్టీసీ భవిష్యత్తుపై రేపు సమావేశమవుతామని ఐకాస అమరావతి సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు చెప్పారు.






