- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు, లోకేష్‌కు జీవితాంతం రుణపడి ఉంటా: చింతకాయల విజయ్
రాజ్యసభలో ఖాళీ అయిన నాలుగు స్థానాలకు కూటమి ప్రభుత్వం అభ్యర్థులను ఖరారు చేసింది. టీడీపీకి 3, జనసేనకు 1 స్థానం చొప్పున భర్తీ చేశారు. జనసేన నుంచి లింగమనేని రమేశ్ నామినేషన్ వేశారు...

దిశ, వెబ్ డెస్క్: రాజ్యసభ(Rajyasabha)లో ఖాళీ అయిన నాలుగు స్థానాలకు కూటమి ప్రభుత్వం(Aliance Government) అభ్యర్థులను ఖరారు చేసింది. టీడీపీకి 3, జనసేనకు 1 స్థానం చొప్పున భర్తీ చేశారు. జనసేన నుంచి లింగమనేని రమేశ్ నామినేషన్ వేశారు. టీడీపీ మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఓ స్థానానికి రాజ్యసభ అభ్యర్థిగా చింతకాయల విజయ్‌ను ఎంపిక చేశారు. దీంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం దక్కడం తన జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు అని సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన చంద్రబాబు, నారా లోకేష్ జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు.ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఎన్నో కష్టాలు పడి, ప్రాణత్యాగాలు చేసిన కార్యకర్తలకు ఈ పదవి అంకితం చేస్తున్నానని తెలిపారు. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన వారిని టీడీపీ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందనడానికి తానే ఉదాహరణ అని చెప్పారు.1983 నుంచి తన తండ్రి అయ్యన్నపాత్రుడు, తమ కుటుంబం టీడీపీ మీద నమ్మకంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు.ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు, లోకేష్, పల్లా శ్రీనివాసరావుల ఆశీస్సులతో పార్టీ కోసం మరింత కష్టపడతానని చింతకాయల విజయ్ స్పష్టం చేశారు.






