- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాన్వీకి పెరుగుతోన్న మద్ధతు.. హీరోయిన్లను కాదు, వ్యవస్థను నిందించండి అంటూ డింపుల్ హయాతి ఫైర్
‘పెద్ది’ సినిమాలో జాన్వీ పాత్రపై వస్తున్న విమర్శలపై హీరోయిన్ డింపుల్ హయాతి రీసెంట్‌గా స్పందించింది.

దిశ, సినిమా: రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ మూవీ రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే.. ఇందులో జాన్వీ పాత్రపై మాత్రం విమర్శలు ఎదురవుతున్నాయి. ఆమెను గ్లామర్ బొమ్మలా, రొమాంటిక్‌గా మాత్రమే చూపించారని, పాత్రలో ప్రాధాన్యత లేదని నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. దీనిపై రీసెంట్‌గా డైరెక్టర్ బుచ్చిబాబు స్పందించి ఇప్పటికే క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. కానీ, కొందరు మాత్రం అలాంటి పాత్ర కేవలం డబ్బుల కోసం మాత్రమే ఒప్పుకుందంటూ జాన్వీపై సైతం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్‌పై సోషల్ మీడియాలో మద్ధతు పెరుగుతోంది. అలాంటి పాత్రలు రాస్తున్న మేకర్స్‌ను వదిలేసి హీరోయిన్స్‌ను తప్పుపట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ పలువురు హీరోయిన్స్ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డింపుల్ హయాతి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
‘నటీమణుల పాత్రలను రాస్తున్న విధానంపై కాకుండా.. వారికి ఇచ్చిన పాత్రలను చేసినందుకు హీరోయిన్స్‌ను మాత్రమే తప్పుబట్టే విధానంపై చర్చ జరగడం నిజంగా సంతోషకరం. ఇక్కడ హీరోయిన్స్‌ను ఇలా మాత్రమే చూపిస్తే అమ్ముడుపోతాయి అని భావించే మేకర్స్ (నిర్మాతలు, దర్శకులు), అండ్ ఈ సినిమా వ్యవస్థను నిందించాలి. మాలాంటి నటీనటులు లభించే అవకాశాలను వినియోగించుకుంటూ, పెద్ద సినిమాల్లో నటిస్తూ మరింత మంది ప్రేక్షకులకు చేరువవ్వాలని ఆశపడుతుంటాము. అయితే.. ఒక పాత్ర సరిగ్గా రాయబడకపోతే ఆ బాధ్యత ఆ పాత్రను పోషించిన మహిళది కాదు, అది పూర్తిగా రైటింగ్ అండ్ మేకింగ్ ఛాయిస్‌లదే అవుతుంది. దురదృష్టవశాత్తూ మేము చేసే పాత్రల ఆధారంగా మా మీద ఒక ముద్ర పడిపోతుంది. దీనివల్ల పూర్తి నటనా సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం కూడా దక్కదు. అదే సమయంలో హీరో ప్రధాన పాత్ర కథల విషయానికి వస్తే వారికి కావాల్సినంత స్వేచ్ఛ, ప్రాధాన్యత లభిస్తాయి. స్క్రీన్‌పై ఏం చూస్తామో దాన్నే ప్రేక్షకులు నమ్ముతారు. సినిమా నిర్మాణంలో ఉండే పరిస్థితులు ఒక్కరి నిర్ణయంపై మాత్రమే ఆధారపడి ఉండవు. అయితే.. మేము కూడా మంచి పాత్రలకు, మంచి సినిమాలకు అర్హులమనే విషయాన్ని అందరూ ఏకగ్రీవంగా అంగీకరించాలి’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది డింపుల్ హయాతి.






