- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిల్లులు విడుదల చేయండి: పవన్ కల్యాణ్‌కు టీడీపీ కీలక నేత లేఖ
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి లేఖ రాశారు...

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan)కు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి(Kadapa District Telugu Desam Party Zonal Coordinator Reddeppagari Srinivasa Reddy) లేఖ రాశారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల(Kadapa Municipal Corporation School)లో జరిగిన తమ పేరెంట్-టీచర్ మీటింగ్(Parent-Teacher Meeting) పర్యటన సందర్భంగా అవసరమైన ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ చిట్టా శివారెడ్డి(Telugu Desam Party Cluster Incharge Chitta Siva Reddy) తన సొంత నిధులతో నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. తమ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల వ్యయాల చెల్లింపుల కోసం R&B శాఖ ద్వారా సంబంధిత ఉత్తర్వులు జారీ చేయబడినప్పటికీ, పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు బిల్లులు విడుదల కాకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ఒక ప్రభుత్వ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ కార్యకర్త తన స్వంత డబ్బులు ఖర్చు చేస్తే, ఆ ఖర్చులకు సంబంధించిన బిల్లులు విడుదల చేయకుండా నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడం ఎంతవరకు సమంజసమని రెడెప్పగారి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.
న్యాయం జరగకపోతే ఎలా..?
పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల కోసం కార్యకర్తలు ముందుకొచ్చి తమ సమయాన్ని, శ్రమను, ఆర్థిక వనరులను వెచ్చిస్తే... వారికి న్యాయం జరగకపోతే రేపు ఏ కార్యకర్తను నమ్మకంతో ముందుకు రావాలని ఎలా చెప్పగలమన్నారు. అధికారిక కార్యక్రమం కోసం ఖర్చు చేసిన డబ్బులు తిరిగి పొందడానికి ఒక కార్యకర్త కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు రావాలని నిలదీశారు. అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణం ఏమిటని రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో, సదరు కార్యకర్త తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల విజయానికి తోడ్పడిన వ్యక్తికి ఇదేనా దక్కాల్సిన గౌరవం అనే ప్రశ్న కార్యకర్తలలో వ్యక్తమవుతోందని రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి తెలిపారు.






