- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాటి చెట్టు పై నుంచి పడి గీతకార్మికుడికి తీవ్ర గాయాలు
ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుంచి కిందపడి ఓ గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి.

దిశ,భూదాన్ పోచంపల్లి: ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుంచి కిందపడి ఓ గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్‌లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముక్తాపూర్ గ్రామానికి చెందిన దుబ్బాక యాదయ్య(55) గీత కార్మికుడిగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజువారీ లాగే కల్లు గీసేందుకు తాటి చెట్టు పై ఎక్కి కల్లు గీస్తున్న క్రమంలో ముసురుగా కురుస్తున్న వర్షం కారణంగా కాలుజారి ఒక్కసారిగా కింద పడ్డాడు.
ఈ ప్రమాదంలో యాదయ్య కుడి భుజం భాగాన ఫ్రాక్చర్ అయింది. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. యాదయ్యను పరీక్షించిన వైద్యులు చెట్టు పైనుంచి కింద పడడం వల్ల పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తులకు గుచ్చుకున్నాయని, దీని వల్ల లోపల రక్తం లీక్ అవుతుందని, వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చులు భరించే శక్తి లేక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.






