- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాదగిరిగుట్టలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు
by Jakkula.Mamatha |
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆదివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆదివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న కేంద్రమంత్రికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్, ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆలయంలో స్వామివారి ఉదయ పూజ, అభిషేక సేవలో పాల్గొని ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, అర్చకులు స్వామివారి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి భవాని శంకర్ కేంద్రమంత్రికి స్వామివారి తీర్థప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అందించారు.
Next Story






