- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్యాన్సర్ నడుంపై చెయ్యేసి లాగిన యువకుడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే?
స్టేజ్‌పై అసభ్యకరంగా ప్రవర్తించిన పోకిరీకి హర్యానా ఫేమస్ డాన్సర్ డింపుల్ చౌదరి ఊహించని రీతిలో సమాధానం చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: రికార్డింగ్ డ్యాన్స్ (Recording Dance)లు అంటేనే ఓ సపరేట్ వైబ్ ఉంటుంది. చుట్టూ వేలల్లో మగాళ్లు స్టేజ్‌పై పొట్టి పొట్టి బట్టలతో అమ్మాయి సందడి చేయడం కామన్. ఈ క్రమంలోనే మహిళా కళాకారులపై అసభ్య ప్రవర్తనలు రిపీటెడ్‌గా జరుగుతుంటాయి. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లోని హాథరస్ (Hathras) జిల్లా సాస్ని పరిధిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తన పట్ల తప్పుగా ప్రవర్తించిన ఓ ఆకతాయికి వేదికపైనే అందరి ముందు ఓ లేడి డ్యాన్సర్ దిమ్మతిరిగేలా బుద్ధి చెప్పింది.
వివరాల్లోకి వెళితే.. హర్యానాకు చెందిన ప్రముఖ స్టేజ్ డాన్సర్ డింపుల్ చౌదరి (Dimple Choudhary) హాథరస్‌లో ఏర్పాటు చేసిన ఓ బర్త్‌డే వేడుకలో షో ఇచ్చేందుకు వెళ్లింది. ఆమె స్టేజ్‌పై ఎంతో ఉత్సాహంగా డాన్స్ వేస్తున్న సమయంలో.. ఎరుపు రంగు క్యాప్ ధరించిన సురేష్ కుమార్ (Suresh Kumar) అనే స్థానిక యువకుడు స్టేజ్ పైకి ఎక్కాడు. ఆమె చుట్టూ తిరుగుతూ మర్యాదలు అతిక్రమించి, అకస్మాత్తుగా డింపుల్ నడుముపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చిన డింపుల్.. ఏమాత్రం భయపడకుండా వెనక్కి తిరిగి ఆ పోకిరీ సురేశ్ చెంప చెల్లుమనిపించింది. ఆమె కొట్టిన దెబ్బకు ఆ యువకుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.
నీ దుమ్ము దులుపుతా.. డింపుల్
అంతటితో ఆగని డింపుల్ చౌదరి మైక్ పట్టుకుని ‘మర్యాదగా ఉండటం నేర్చుకో.. నడుంపై చేయి వేస్తే ఒక్క నిమిషంలో నీ దుమ్ము దులుపుతా’ అంటూ వేదికపైనే అందరి ముందు క్లాస్ పీకి, నిరసనగా కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయింది. అయితే పోకిరీని చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు కొందరు తమ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం అవి కాస్త విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అనంతరం ఘటనను ఉత్తరప్రదేశ్ పోలీసులు (Uttar Pradesh Police) సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టారు. నిందితుడు సురేష్ కుమార్‌ను సాస్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.






