టీచర్, ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

by Jakkula.Mamatha |

ప్రభుత్వ ఆదేశాల మేరకు భూదాన్ పోచంపల్లి మండలంలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా మంజూరైన ప్రీ ప్రైమరీ తరగతులకు బోధించేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మండల విద్యాధికారి ప్రభాకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

టీచర్, ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, భూదాన్ పోచంపల్లి: ప్రభుత్వ ఆదేశాల మేరకు భూదాన్ పోచంపల్లి మండలంలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా మంజూరైన ప్రీ ప్రైమరీ తరగతులకు బోధించేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మండల విద్యాధికారి ప్రభాకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని పిల్లాయిపల్లి ప్రాథమిక పాఠశాల, పోచంపల్లి ప్రాథమిక పాఠశాల, ముక్తాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల, జిబ్లక్పల్లి ప్రాథమిక పాఠశాలలో తరగతులు ప్రారంభం కానున్నాయని, టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ (డి.ఈడి), ఆయా పోస్టులకు 7వ తరగతి విద్యార్హత కలిగి ఉండాలని తెలిపారు. వయసు 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉండాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు అవకాశం ఉందని పేర్కొన్నారు. అర్హత గల మహిళ అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు ఈ నెల 16 లోగా స్థానిక ఎంఈవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

Next Story