- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్రస్ట్రేషన్‍లో ఏదో ఊహించుకుని మాట్లాడుతున్నారు.. హరీశ్ రావుపై ఆది శ్రీనివాస్ ఫైర్
ఫ్రస్ట్రేషన్‍లో హరీశ్ రావు ఏదో ఊహించుకుని మాట్లాడుతున్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పొలిటికల్ డైవర్షన్ కోసం, ఫ్రస్ట్రేషన్ లో హరీశ్ రావు ఏదో ఊహించుకుని మాట్లాడుతున్నారని ఆయనకు కృష్ణా జలాలపై మాట్లాడే హక్కు లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ హాయంలో కాళేశ్వరం కూలినప్పుడు మీరెందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాయలసీమకు నీళ్లు ఇస్తామని గతంలో కేసీఆర్ చెప్పలేదా? ప్రగతిభవన్ లో జగన్‍కు ఏం చెప్పారో గుర్తులేదా అని అని నిలదీశారు. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాకు మరణ శాసనం రాసిన మీరు ఇప్పుడు మాట్లాడటానికి కొంచమైన సిగ్గుపడాలన్నారు. చేసిన తప్పులకు పరిహారంగా ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు ముక్కు నేలకు రాసి ముందుకురావాలన్నారు. మా ప్రభుత్వంలో సాగునీటి రంగంలో ప్రాజెక్టులు వేగంగా జరుగుతున్నాయన్నారు. తెలంగాణ బీజేపీ మహారాష్ట్ర సీఎంతో అపాయింట్‍మెంట్‍పై స్పందించాలన్నారు. తమ్మిడి హట్టి గురించి బీజేపీ మాట్లాడటం లేదన్నారు.






