విద్యాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలి: ఎమ్మెల్యే

by Taduka Kalyani |

సమాజంలో మరింత విద్యాభివృద్ధిని పెంపొందించేందుకు స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

విద్యాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలి: ఎమ్మెల్యే
X

దిశ, కాప్రా: సమాజంలో మరింత విద్యాభివృద్ధిని పెంపొందించేందుకు స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. భావసార్ క్షత్రియ సమాజ్ హైదరాబాద్ (నార్త్) సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం కాప్రా లోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన పేద విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు, సామగ్రి పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. సమాజంలో విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, అలాంటి నాణ్యమైన విద్య ప్రతి పేద విద్యార్థికి అందాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నోటు పుస్తకాలు, ఇతర విద్య సామాగ్రిని అందజేస్తున్న బావసార్ క్షత్రియ సమాజ్ ప్రతినిధులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా చేపట్టాలని సూచించారు. అలాగే విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భావసార్ క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు కిషోర్ నర్సింగ్ రావు, విగ్రహానికి కార్యవర్గ సభ్యులు, స్థానిక నాయకులు నవీన్ గౌడ్, బద్రుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

Next Story