దిశ ఎఫెక్ట్.. గంటల్లోనే సమస్య పరిష్కారం

by Taduka Kalyani |

హస్తినాపురం డివిజన్ పరిధిలోని భూపేష్ గుప్తా నగర్‌లో రోడ్డుమధ్యలో దెబ్బతిన్న మ్యాన్‌హోల్ స్థానికులకు, వాహనదారులకు తీవ్ర ప్రమాదకరంగా మారింది.

దిశ ఎఫెక్ట్.. గంటల్లోనే సమస్య పరిష్కారం
X

దిశ, హస్తినాపురం : హస్తినాపురం డివిజన్ పరిధిలోని భూపేష్ గుప్తా నగర్‌లో రోడ్డుమధ్యలో దెబ్బతిన్న మ్యాన్‌హోల్ స్థానికులకు, వాహనదారులకు తీవ్ర ప్రమాదకరంగా మారింది. ఈ సమస్యను స్థానిక బీజేపీ నాయకులు, కాలనీవాసులు దిశ దినపత్రిక దృష్టికి తీసుకురావడంతో వార్తగా ప్రచురించింది. మ్యాన్‌హోల్ దెబ్బతినడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంతో కాలనీవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వార్త ప్రచురితమైన వెంటనే సంబంధిత జలమండలి అధికారుల దృష్టికి సమస్య వెళ్లగా, వారు తక్షణమే స్పందించి దెబ్బతిన్న మ్యాన్‌హోల్‌కు మరమ్మతులు చేపట్టి కొత్త కవర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో స్థానికుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. సమస్య పరిష్కారమైన అనంతరం కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ, తమ సమస్యను గుర్తించి వెంటనే స్పందించిన దిశ దినపత్రికకు, అలాగే చర్యలు తీసుకున్న జలమండలి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకుడు ఎరుకల మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ, "ప్రజల సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నాం. హస్తినాపురం డివిజన్‌లో ప్రతి సమస్యపై అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటాం" అని తెలిపారు.

Next Story