మృగశిర కార్తె.. చేపలకు భలే గిరాకీ

by Taduka Kalyani |

మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదనే నమ్మకం పూర్వీకుల కాలం నుంచి కొనసాగుతోంది.

మృగశిర కార్తె.. చేపలకు భలే గిరాకీ
X

దిశ, కమ్మర్‌పల్లి : మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదనే నమ్మకం పూర్వీకుల కాలం నుంచి కొనసాగుతోంది. ఈ ఆచారాన్ని అనుసరిస్తూ ఆదివారం మృగశిర కార్తె సందర్భంగా కమ్మర్‌పల్లి కేంద్రంలో ప్రజలు పెద్ద ఎత్తున చేపలను కొనుగోలు చేయడంతో మార్కెట్ సందడిగా మారింది. మృగశిర కార్తె ప్రభావంతో చేపల ధరలు సాధారణ రోజుల కంటే పెరిగినప్పటికీ, ప్రజలు ధరలను లెక్కచేయకుండా ఆసక్తిగా కొనుగోలు చేశారు. దీంతో చేపల మార్కెట్లలో రద్దీ నెలకొంది. ఉదయం నుంచే మత్స్యకారులు సమీపంలోని చెరువులు, కుంటల్లో చేపలు పట్టి గ్రామాలు, మార్కెట్ ప్రాంతాల్లో విక్రయించారు. పెరిగిన డిమాండ్ కారణంగా చేపల వ్యాపారం జోరుగా సాగిందని వ్యాపారులు తెలిపారు. మరోవైపు, మృగశిర కార్తె సందర్భంగా సంప్రదాయాన్ని పాటిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి చేపల వంటకాలను ఆస్వాదించేందుకు ప్రజలు ఆసక్తి చూపారు.

Next Story