- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలా చేయకపోతే తెల్లాపూర్ శాసనానికి కట్టేసి రాళ్లతో కొట్టండి: కవిత
అన్నింటికీ నోరు వేసుకొని పడిపోయే రఘునందన్ రావు ఇప్పుడు ఎందుకు నోటి తాళం వేసుకున్నారని కవిత ప్రశ్నించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఉండగా కొత్త పార్టీ అవసరం ఏంటనీ కొంత మంది అడుగుతున్నారని మూడు ప్రధాన పార్టీలు ఉన్నా పేద ప్రజలు చదువుకునేందుకు ఇబ్బంది పడే పరిస్థితి ఎందుకు ఉందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. సర్కార్ స్కూళ్లలో పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని చదువుకుంటామని పిల్లలు అడిగితే అవకాశం కల్పించలేని పార్టీలు ఉంటే ఎంత లేకుంటే ఎంత? అని మండిపడ్డారు. ఇవాళ ఒక ప్రమాదం జరిగితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల్లో ఖర్చు అవుతుందని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తామంటే అక్కడ సూది ఉంటే దూది లేని పరిస్థితి ఉందన్నారు. ఈ బాధలన్నీ ఒక తల్లి మాదిరిగా ఆలోచిస్తేనే అర్థం అవుతాయని మీ ఆడబిడ్డగా నేను ముందుకు వచ్చానన్నారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డల మీద నమ్మకంతో పార్టీ పెట్టాననని కచ్చితంగా మేము మార్పు తీసుకొస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చాక ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వకపోతే తెల్లాపూర్ శాసనానికి కట్టేసి రాళ్లతో కొట్టండని పిలుపునిచ్చారు.
రఘునందన్ నోటికి తాళం ఎందుకు వేసుకున్నారు?:
జహీరాబాద్‍కు బుల్లెట్ ట్రైన్ ఇవ్వకపోతే ఎంపీ రఘనందన్ రావు నోరు మెదపటం లేదని కవిత మండిపడ్డారు. అన్నింటికీ నోరు వేసుకొని పడిపోయే రఘునందన్ రావు ఇప్పుడు ఎందుకు నోటి తాళం వేసుకున్నారని నిలదీశారు. బుల్లెట్ ట్రైన్ ఇవ్వని బీజేపీని మిగతా రాజకీయ పార్టీలు ఎందుకు ప్రశ్నించటం లేదని ప్రశ్నించారు. జహీరాబాద్‍కు బుల్లెట్ ట్రైన్ వచ్చే వరకు మేము కొట్లాడుతామన్నారు. ఎంఎంటీఎస్ ట్రైన్ తెస్తామని పేదవాళ్ల ఇండ్లు తీసుకొని వాళ్లను రోడ్డున పడేశారని కానీ ఇప్పటి వరకు ట్రైన్ రాలేదు. వారికి పరిహారం అందలేదన్నారు. బీజేపీని ప్రశ్నించాల్సిన మిగతా పార్టీలు సైలెంట్ ఉంటాయన్నారు. అన్ని పార్టీల నాయకులు దోచుకుంటూ ప్రజలను ఆగం చేస్తున్నారని ఆరోపించారు. సంగారెడ్డిలో అన్ని పార్టీలకు చెందిన పెద్ద నాయకులు ఉన్నారు. కానీ అందరూ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేసే వారేనని కవిత ఆరోపించారు. పటాన్ చెరు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో తెలియదని, సంగారెడ్డి ఎమ్మెల్యే ఒక పార్టీ గెలిచే ఇంకో పార్టీ పనులకు వెళ్తారన్నారు. ఆందోల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వచ్చిందని సంతోషిద్దామంటే వాళ్ల బావమరిది సింగూర్ ఎఫ్టీఎల్ కింద 2 వంద ఎకరాలు కబ్జా చేశాడని ఆరోపించారు. వీళ్లంతా రాజకీయంగా ఎదిగి, ప్రజలకు మాత్రం ఏమీ చేయటం లేదన్నారు. మేము పాంచజన్యం అనే ఐదు కీలక అంశాలను ప్రాధాన్యంగా పెట్టుకున్నాంమన్నారు. రైతుల కల్లాల దగ్గర గుండెపోటుతో చనిపోతే అడిగే గుండె ధైర్యం ఏ పార్టీకి లేదుని వారికోసం మేము కొట్లాడుతాం. రైతును గౌరవించే జవాబుదారీ ప్రభుత్వాన్ని నడిపిస్తామన్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి సామాజిక న్యాయ తెలంగాణను సాధిస్తామన్నారు. .
మన ప్రాంతాన్ని ప్రేమించే రాజకీయ శక్తి అవసరం:
తెలంగాణ వస్తే పేద బిడ్డలు జేబు చూసుకోవాల్సిన పరిస్థితి రాదని అనుకున్నాం కానీ అలా జరగలేదని పేద ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారున్నారు. సింగూరు ప్రాజెక్ట్ 15 ఏళ్లుగా కుంగుతూనే ఉందని ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. ఆంధ్రావాళ్లు ఇవ్వలేదంటూ వాళ్లను తిట్టాం. కానీ ఇప్పుడు ఎందుకు మనం బాగు చేసుకోలేదని నిలదీశారు. 2016-2017 లో సింగూర్ ఎండిపోయింది. అప్పుడు బాగు చేసుకునే అవకాశం ఉండేనని ఇప్పడు నిండా ఉన్న సింగూర్‍ను ఆపి రిపేర్ చేసుకునే పరిస్థితి తెచ్చారని దుయ్యబట్టారు. శ్రద్ధ, ప్రేమ లేని కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే మన ప్రాంతాన్ని ప్రేమించే కొత్త రాజకీయ శక్తి రావాల్సిన అవసరం ఉంది.






