మ‌ల్ద‌క‌ల్ జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల వాచ్ ఉమెన్ మృతి

by Nallavelli.Anjaneyulu |

జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల మ‌ల్ద‌క‌ల్ లో దాదాపు 29 సంవ‌త్స‌రాల నుంచి వాచ్ ఉమెన్ కం స్వీప‌ర్ గా ప‌ని చేస్తున్న ల‌క్ష్మీదేవ‌మ్మ ఆదివారం ఉద‌యం మ‌ర‌ణించింది.

మ‌ల్ద‌క‌ల్ జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల వాచ్ ఉమెన్  మృతి
X

దిశ‌, మ‌ల్ద‌క‌ల్ : జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల మ‌ల్ద‌క‌ల్ లో దాదాపు 29 సంవ‌త్స‌రాల నుంచి వాచ్ ఉమెన్ కం స్వీప‌ర్ గా ప‌ని చేస్తున్న ల‌క్ష్మీదేవ‌మ్మ ఆదివారం ఉద‌యం మ‌ర‌ణించింది. ఆమె గ‌త కొంత కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది. ప్ర‌భుత్వ ప‌రంగా అందించాల్సిన అంత్య‌క్రియ‌ల ఖ‌ర్చు నిమిత్తం రూ.30వేలు ఆమె కుటుంబ స‌భ్యుల‌కు క‌ర్నూల్ పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయులు జి.సురేష్ అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఆత్మ‌కు శాంతి క‌లగాల‌ని శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. ఉపాధ్యాయులు కుటుంబ స‌భ్యుల‌కు, బంధుమిత్రుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. ప్ర‌ధానోపాధ్యాయులు వెంట ఉపాధ్యాయులు రాజేశ్వ‌ర్ రెడ్డి, జాకీర్ హుస్సెన్, విజ‌య్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story