నల్లగొండలో షాకింగ్ ఘటన.. కుటుంబం మొత్తం ఒకేసారి మిస్సింగ్!

by Jakkula.Mamatha |

నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓ కుటుంబం మొత్తం కనపడటం లేదు.

నల్లగొండలో షాకింగ్ ఘటన.. కుటుంబం మొత్తం ఒకేసారి మిస్సింగ్!
X

దిశ, నల్లగొండ క్రైమ్: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓ కుటుంబం మొత్తం కనపడటం లేదు. ఈ ఘటన నల్లగొండలో కలకలం రేపుతోంది. కరీంనగర్ జిల్లా జగిత్యాల నుంచి గిరి శ్రీకాంత్ భార్య, ఇద్దరు పిల్లలతో బతుకుదెరువు కోసం నల్లగొండకు వచ్చాడు. ఆరేళ్లుగా శ్రీకాంత్, అతని భార్య లక్ష్మీ ఓ కిరాణా షాపులో పనిచేస్తూ మిర్యాలగూడ రోడ్ బీటీఎస్ లోని శ్రీనివాస కాలనీలో కుమార్తె హర్షిత, కుమారుడు సాయి చరణ్‌తో కలిసి ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరు శనివారం నుంచి కనిపించకపోవడంతో కిరాణా షాపు యజమాని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పుల బాధతోనే కుటుంబంతో కలిసి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారా..? మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీరి గురించి సమాచారం తెలిస్తే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నెంబర్ 8712667670, ఎస్.ఐ జె. సైదులు సెల్ 8712577228 నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలపాలని వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

Next Story