రైతుల అభివృద్ధే లక్ష్యం: రీజినల్ మేనేజర్ గజేంద్ర సింగ్ చౌహాన్

by Jakkula.Mamatha |

రైతుల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న వ్యవసాయ రుణ అవుట్‌రీచ్ కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో శనివారం ప్రత్యేక అవుట్‌రీచ్ శిబిరాన్ని నిర్వహించింది.

రైతుల అభివృద్ధే లక్ష్యం: రీజినల్ మేనేజర్ గజేంద్ర సింగ్ చౌహాన్
X

దిశ, జోగులాంబ ప్రతినిధి /ఇటిక్యాల: రైతుల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న వ్యవసాయ రుణ అవుట్‌రీచ్ కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో శనివారం ప్రత్యేక అవుట్‌రీచ్ శిబిరాన్ని నిర్వహించింది. హైదరాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని రీజినల్ మేనేజర్ గజేంద్ర సింగ్ చౌహాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో, అందుబాటు వడ్డీ రేట్లతో రుణ సదుపాయాలు కల్పించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి సెంట్రల్ బ్యాంక్ కట్టుబడి ఉందన్నారు. స్వయం సహాయక సంఘాల రుణాలు, నారీ శక్తి రుణాలు, మొబైల్ బ్యాంకింగ్ సేవల వినియోగంపై అవగాహన కల్పిస్తూ రైతులు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

జోగులాంబ గద్వాల జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎల్. శ్రీనివాస్ రావు సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు మరియు సురక్షిత డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ రీజియన్ పరిధిలో సుమారు రూ.50 కోట్ల విలువైన వ్యవసాయ రుణ మంజూరు పత్రాలను రైతులకు అందజేశారు. ఇందులో ఇటిక్యాల శాఖ ద్వారా సుమారు రూ.2 కోట్ల విలువైన వ్యవసాయ రుణాలు మంజూరు చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జీవన్ రెడ్డి, మండల రెవెన్యూ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ నాగరాజు, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్(బ్యాంకింగ్) బి.ఆర్. సలోమీ, బ్యాంక్ మేనేజర్ రఘు వీర్ హాజరయ్యారు. రైతులు, ఖాతాదారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .

Next Story