కొన్నాళ్లకు నాపై ఒత్తిడి పెరిగింది.. అందుకే వాటికి దూరం అయ్యా: Taapsee Pannu

by Chukka Sudharani |   (  Updated:2026-06-07 09:49:28  IST  )

హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘గాంధారి’.

కొన్నాళ్లకు నాపై ఒత్తిడి పెరిగింది.. అందుకే వాటికి దూరం అయ్యా: Taapsee Pannu
X

దిశ, సినిమా: హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘గాంధారి’. దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండటంపై షాకింగ్ అభిప్రాయాన్ని పంచుకుంది తాప్సీ. ‘సోషల్ మీడియాలో తక్కువగా కనిపించాలని గత ఏడాదే నిర్ణయం తీసుకున్నా. దీనికి ప్రత్యేకంగా ఎలాంటి కారణం లేదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. నేను సోషల్ మీడియా స్టార్ట్ చేసిన కొన్నాళ్లకు అది పరుగు పందెంలా అనిపించడం. అందరూ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ, ఎప్పుడూ కనిపిస్తూ ఉండాల్సిందే అన్న ఒత్తిడి పెరిగింది. అందుకే నా జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆ నర్ణయం తీసుకున్నా’. అని తెలిపింది.

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న దివి.. అయినా గ్లామర్ డోస్ మాత్రం తగ్గట్లేదు

Next Story