వ్యాయామాలే కాదు.. గార్డెనింగ్‌తోనూ ఆరోగ్యంగా ఉండొచ్చు!

by Javid Pasha |

గార్డెనింగ్‌లో తవ్వడం, నాటడం, కలుపు తీయడం వంటి పనులు తగిన శారీరక శ్రమను అందిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

వ్యాయామాలే కాదు.. గార్డెనింగ్‌తోనూ ఆరోగ్యంగా ఉండొచ్చు!
X

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా ఉండాలంలో సమతుల్య ఆహారంతో పాటు వ్యాయామం కూడా అవసరమనే విషయం తెలిసిందే. అయితే సమయం లేకనో, ఆసక్తిలేకనో కొందరు వ్యాయామం చేసేందుకు ఇష్టపడరు. ముఖ్యంగా వృద్ధులు, కొందరు మహిళలు బయటకు వెళ్లి రొటీన్ వ్యాయామాలు చేయడం ఇబ్బందిగా ఫీలవ్వొచ్చు. అలాంటివారు రొటీన్ వ్యాయామాలకు బదులుగా గార్డెనింగ్ పనులు చేసినా అదే ఫలితాన్ని పొందవచ్చునని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. నేచర్ కనెక్టివిటీ, గార్డెనింగ్ వంటివి కూడా సేమ్ ప్రయోజనాలు కలిగిస్తాయని చెబుతున్నాయి.

*రోజూ ఉదయాన్నే ఎక్సర్‌సైజ్ చేయడానికి టైమ్ లేనివారు గార్డెనింగ్ చేయడం, నేచర్‌తో కనెక్ట్ అవడం వంటివి ఫాలో కావచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. పైగా ఇలా చేయడంవల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గిపోతాయని. మానసిక, శారీరక ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు.

* గార్డెనింగ్‌లో తవ్వడం, నాటడం, కలుపు తీయడం వంటి పనులు తగిన శారీరక శ్రమను అందిస్తాయి. ఇది కేలరీలను బర్న్ చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

*మట్టితో పనిచేయడం వల్ల శరీరం సూక్ష్మజీవులకు గురవుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే గార్డెనింగ్ సమయంలో సూర్యరశ్మికి గురికావడం వల్ల శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

*పెరటిలో లేదా మొక్కలతో సమయం గడపడం, ప్రకృతితో సన్నిహితంగా ఉండటం వంటి నేచర్ కనెక్టివిటీవల్ల కార్టిసాల్ ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల మానసిక వికాసం కలుగుతుంది. అంతేకాకుండా గార్డెనింగ్ ఆందోళన, డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది. మానసిక శాంతిని పెంపొందిస్తుంది.

*గార్డెన్ డిజైన్ చేయడం, మొక్కల సంరక్షణ చూసుకోవడం వంటివి సృజనాత్మక ఆలోచనలను, ఏకాగ్రతను పెంచుతాయి. ఇక కమ్యూనిటీ గార్డెనింగ్ వంటి పనుల్లో పాల్గొనేవారిలో వీటితోపాటు సామాజిక సంబంధాలు కూడా బలపడతాయి. లోన్లీనెస్, డిప్రెషన్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. అంతేకాకుండా పర్యావరణపంట్ల బాధ్యత, స్థిరమైన జీవన శైలిపట్ల ఆసక్తి కూడా పెరుగుతాయి. ఇవన్నీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Next Story