- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్మపై నాకు చాలా నమ్మకం ఉంది.. అందుకే అలాంటి పనులు చేస్తా.. మృణాల్ కామెంట్స్ వైరల్
సేవ చేయడంలో ఉన్న ఆనందమే వేరు అంటుంది బాలీవుడ్ క్యూట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.

దిశ, సినిమా: సేవ చేయడంలో ఉన్న ఆనందమే వేరు అంటుంది బాలీవుడ్ క్యూట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతా రామం, హాయ్ నాన్న వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో సైతం ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరోయిన్.. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో అవకాశాలు అందుకుంటూ వరుస సినిమాలు చేస్తుంది. అలాగే త్వరలో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ఈ మేరకు కోలీవుడ్ స్టార్ ధనుష్ సినిమాలో చాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇలా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. సేవా చేయడంలో కూడా ఒక తృప్తి ఉంటుంది అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘ఇప్పటివరకు ఏదేదో ఆనందాన్ని ఇస్తుందని నేను అనుకున్నా. కానీ అది నిజం కాదు.. జీవితంలో మనకు నిజమైన ఆనందం ఉన్నదానిలో ఇతరులకు ఇవ్వంలోనే ఉంటుంది. పెద్ద మొత్తంలో కాకపోయినా మనకు ఉన్నదానిలో కొంత లేనివారికి సాయం చేయాలి. ముఖ్యంగా నాకు కర్మపై చాలా నమ్మకం ఉంది. అయితే చేసిన సాయానికి ప్రతిఫలం ఉంటుందా? లేదా? అనేది మాత్రం ఆలోచించను. నాకు తోచిన సాయం చేస్తుంటాను. దాని వల్ల ఎవరైనా సంతోష పడితే అంతే చాలు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మృణాల్ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
- Tags
- Mrunal Thakur






