కానిస్టేబుల్ కుటుంబానికి మిత్రులు రూ.1.50 లక్షల ఆర్థిక సాయం..

by Kodari Anjali |

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆయన 2007 బ్యాచ్‌మెంట్ స్నేహితులు రూ.1,50,000 ఆర్థిక సాయం అందించారు.

కానిస్టేబుల్ కుటుంబానికి మిత్రులు రూ.1.50 లక్షల ఆర్థిక సాయం..
X

దిశ, సూర్యాపేట: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వల్లపుదాసు సైదులు గౌడ్ కుటుంబానికి ఆయన 2007 బ్యాచ్‌మెంట్ స్నేహితులు కలిసి రూ.1,50,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. సైదులు ఆకస్మిక మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబానికి అండగా నిలుస్తూ ఈ సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సైదులు స్నేహితులు మాట్లాడుతూ, తమ సహచరుడి కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, అవసరమైన సమయంలో తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.

హెల్మెట్ ప్రాణాలను కాపాడే రక్షణ కవచం..

అలాగే రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని, నిర్లక్ష్యం కారణంగా విలువైన ప్రాణాలు కోల్పోకూడదని పేర్కొన్నారు. సైదులు మరణం తమను తీవ్రంగా కలచివేసిందని, ఆయన కుటుంబానికి అందరూ అండగా నిలవాలని స్నేహితులు విజ్ఞప్తి చేశారు. వారి ఈ సహాయ కార్యక్రమం మానవత్వానికి నిదర్శనంగా నిలిచిందని పలువురు అభినందించారు. సురేందర్ రెడ్డి, మధుమోహన్ పాలడుగు రవి ,నాగరాజు, కరుణాకర్, సైదులు, బాలకృష్ణ, మాధవ్ కొండల్, తదితరులు పాల్గొన్నారు.

Next Story