- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిలోకు నాలుగు రూపాయలే ఇస్తున్నారు: తోతాపురి రైతుల తీవ్ర ఆవేదన
ప్రస్తుతం మామిడి కాయల్ సీజన్ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని మార్కెట్లో విరివిగా అమ్ముడుపోతున్నాయి. సీజనల్ ప్రూట్ కావడంతో ప్రజలు కూడా ఎంతో ఆసక్తితో కొనుగోలు చేస్తున్నారు...

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం మామిడి కాయల్ సీజన్ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని మార్కెట్లో విరివిగా అమ్ముడుపోతున్నాయి. సీజనల్ ప్రూట్ కావడంతో ప్రజలు కూడా ఎంతో ఆసక్తితో కొనుగోలు చేస్తున్నారు. ధరలు సైతం అందుబాటులో ఉండటంతో కిలోలుకిలోలు కొనుగోలు చేస్తున్నారు. మామిడి పండ్లను కడుపరా ఆరగిస్తున్నారు. ఇక తోతాపురి పండ్లకైతే మంచి డిమాండే ఉంది. అయినా సరే వినియోగదారులు కొనుగోలు చేసి మరీ టెస్ట్ చేస్తున్నారు. కానీ అవి పండించిన రైతు మాత్రం అసంతృప్తిగా ఉంటున్నారు. పండించిన పంటకు సరైన ధర లేక అల్లాడిపోతున్నారు. కనీసం పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుననారు. తాజాగా తిరుపతి జిల్లా చంద్రగిరిలో మామిడి రైతుల సమావేశం నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా మామిడి కొనుగోలుపై చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కిలో తోతాపురికి రూ.4 చొప్పున కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. మండీల సిండికేటు, గిట్టుబాటు ధరలపై కలెక్టర్‌ను కలుస్తామని తెలిపారు. తోతాపురి పంటకు గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని రైతులు కోరారు.






