- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి పదవి రాకుంటే రాజీనామా చేస్తా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
తెలంగాణ కాంగ్రెస్‌లో కేబినెట్ విస్తరణ వేళ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో సీఎం మార్పు తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా త్వరలోనే మంత్రివర్గ విస్తరణతో పాటు ప్రభుత్వంలో కీలక మార్పులు ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఆశిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన ఆయన రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనన్నారు. నాకు మంత్రి పదవి అడగడంలో తప్పేం ఉందని ప్రశ్నించారు. మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు నేనూ రేసులో ఉన్నట్లు చెప్పారు. మిగిలిన వాళ్లు ప్రయత్నం చేయడం వాళ్ల పరిధిలోని అంశం అని చెప్పారు. తనకు మంత్రి పదవి ఇవ్వడానికి కుల సమీకరణాలు అడ్డొస్తే నేను రాజీనామా చేసి త్యాగం చేయడానికైనా సిద్ధం అన్నారు. నిన్నటి సభ విజయవంతంతో బీఆర్ఎస్ నేతల నోళ్లు మూతపడ్డాయని సీఎం సభలో ప్లకార్డులు పట్టుకోవడం తప్పు కాదని, కార్యకర్తలు వాళ్ల అభిప్రాయం చెప్పారన్నారు. మహేశ్ గౌడ్ ఎందుకు మాట్లాడారో తెలియదని నాకు ఎవరూ వార్నింగ్ ఇవ్వలేదన్నారు.
త్వరలో కీలక మార్పులు!:
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటినా ఇంకా పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు కాలేదు. ఇంకా రెండు మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉంది. త్వరలోనే ఈ రెండు మంత్రి పదవులతో పాటు శాఖల పునర్విభజన, స్పీకర్ మార్పు, డిప్యూటీ సీఎం పోస్టులు, ప్రభుత్వ విప్‍ల విషయంలోనూ హైకమాండ్ మార్పులు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చుతూ ఇటీవలే శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో భేటీ కావడం తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీని కలిశారు. ఈ పరిణామాలతో తెలంగాణలో కీలక మార్పులు ఉండబోతున్నాయనే చర్చ జరుగుతోంది.
హైకమాండ్‍కు కొత్త తలనొప్పులు:
తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లో మంత్రి పదవుల కోసం పెద్ద ఎత్తున ఆశావహులు ఎదురు చూస్తున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని నేతలు బహిరంగంగానే డిమాండ్లు చేస్తూన్నారు. ఈ నేపథ్యంలో ఆశిస్తున్నవారిలో ముఖ్యమైన వారిని కెబినెట్‍లోకి తీసుకోవాలన్నా ప్రస్తుత మంత్రులకు ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. దీంతో కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు ఎవరిని పక్కన పెడుతారు? ఎవరికి ప్రమోషన్ కల్పిస్తారు అనేది కీలకంగా మారింది. ఒక వేళ సామాజిక సమీకరణాల కోసం ఎవరినైనా తప్పిస్తే అది ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతోంది అనేది ఉత్కంఠగా మారింది. ఇటీవల కర్ణాటకలో సిద్దరామయ్యను తప్పించి డీకే శివకుమార్ ను సీఎం చేసింది అధిష్టాం. అయితే అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటై వారం రోజులైనా గడవక ముందే నీటి పారుదలశాఖ మంత్రి రామలింగారెడ్డి రాజీనామా చేయడం కలకలం రేపింది. తనకు ఇష్టం లేని శాఖ కేటాయించారని అసహనం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమస్యను తాము పరిష్కరించుకుంమని డీకే శివకుమార్ తెలిపారు. ఇది టీ కప్పులో తుపాను వంటిదేనని చెప్పారు. తెలంగాణలోనూ మంత్రివర్గ విస్తరణలో జరగబోయే మార్పులు చేర్పులతో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయి? అవి హైకమాండ్‍కు ఎలాంటి తలనొప్పులు తీసుకురాబోతోంది అనేది తెలంగాణ కాంగ్రెస్‍లో ఆసక్తిగా మారింది.






