- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఖిల్ ‘లెనిన్’కి అదే కీలకం.. నాగార్జునకి కూడా సూపర్‌గా నచ్చిందా?
అఖిల్ హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ సినిమా ఫస్ట్ కాపీని నాగార్జున చూసి క్లైమాక్స్‌ను ప్రత్యేకంగా ప్రశంసించినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘లెనిన్’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను జూన్ 26న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. తాజాగా దానిని నాగార్జున చూసినట్లు సమాచారం. ఆయనకు ఈ సినిమా మొత్తం నచ్చినట్లు, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే బాగా నచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర క్లైమాక్స్‌ను దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు చాలా కొత్తగా డిజైన్ చేసినట్లు, అది ఎవరు ఊహించని విధంగా ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం.
అఖిల్ హీరోగా కెరీర్ ప్రారంభించి చాలా సంవత్సరాలు అవుతోంది. కానీ ఆయనకు ఇప్పటివరకు సరైన సూపర్ హిట్ దక్కలేదు. ఆ కోరిక ఈ సినిమాతో నెరవేరే అవకాశం ఉన్నట్లు, ఈ సినిమా చూసిన చాలామంది అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అఖిల్‌కు జోడిగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటించనుండగా, ఎస్. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






