నిరుపేద బాలుడికి అండగా మంత్రి పొంగులేటి

by Jakkula.Mamatha |

మానవత్వాన్ని చాటుకుంటూ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి తన సేవా దృక్పథాన్ని నిరూపించారు.

నిరుపేద బాలుడికి అండగా మంత్రి పొంగులేటి
X

దిశ, ఖమ్మం రూరల్: మానవత్వాన్ని చాటుకుంటూ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి తన సేవా దృక్పథాన్ని నిరూపించారు. ఏదులాపురం మున్సిపాలిటీ తెల్దారుపల్లికి చెందిన గుంజి రాకేష్(15) బ్రెయిన్ ఆపరేషన్ కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి వెంటనే స్పందించి అవసరమైన సహాయ సహకారాలు అందించారు. మంత్రి చొరవతో పాటు మంత్రి క్యాంపు ఆఫీస్ ఇంచార్జ్ తుంబురు దయాకర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో రాకేష్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించబడింది. దీంతో బాలుడు ఆరోగ్యంగా కోలుకుంటుండగా, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెల్దారుపల్లి గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కార్యాలయం ఇంచార్జ్ తుంబురు దయాకర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి ధైర్యం నింపిన మంత్రి సేవా గుణం, పెద్ద మనసు సమాజానికి ఆదర్శమని కొనియాడారు. బాలుడు రాకేష్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.

Next Story