చేపల మార్కెట్‌లో ‘మృగశిర’ సందడి

by Jakkula.Mamatha |

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్లో గల చేపల మార్కెట్‌లో మృగశిర కార్తె సందడి నెలకొంది.

చేపల మార్కెట్‌లో ‘మృగశిర’ సందడి
X

దిశ, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్లో గల చేపల మార్కెట్‌లో మృగశిర కార్తె సందడి నెలకొంది. ఆదివారం ఉదయం నుంచి మృగశిర కార్తి సందర్భంగా చేపల మార్కెట్‌లో చేపలను కొనుగోలు చేసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో బారులు చేపలను కొనుగోలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తెను ప్రజలు ఒక సాంప్రదాయ పండుగల నిర్వహించుకుంటారు. గత నాలుగు నెలలుగా దంచి దంచి కొట్టిన సూర్యరశ్మి ఎండల వేడిమి నుంచి మృగశిర కార్తె రోజు నుంచి వర్షాకాలం ప్రారంభం అవుతుంది కావున.. ఈ సమయం నుంచి ప్రజలందరి ఆరోగ్యం బాగుండాలని, సీజనల్ వ్యాధులు తగ్గాలని మృగశిర కార్తె సందర్భంగా ఆర్మూర్ ప్రాంతంలోని ప్రజలు ప్రత్యేకంగా అనాది కాలం నుంచి ప్రత్యేకమైన ఆహారాలు భుజిస్తుంటారు. దాంట్లో ప్రధానంగా మృగశిర కార్తెకు ప్రజలందరూ సాంప్రదాయం ప్రకారం చేపల కూరను వంటగా చేసుకోవడం అనాదిగా వస్తుంది.

దీంతో చేపలను ఆర్మూర్ ప్రాంత ప్రజలు మృగశిర సందర్భంగా ఆదివారం మార్కెట్లో భారీగా వరుసలో నిలబడి కొనుగోలు చేశారు. అదేవిధంగా ఈ మృగశిర కార్తె సమయానికి ఎండలు తగ్గిపోయి వర్షాలు ప్రారంభం అవుతుండడంతో ప్రజలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మృగశిర కార్తె రోజు చేపల కూరను వండుకుని తినడం సాంప్రదాయబద్ధంగా అనాది కాలం నుంచి వస్తుంది. దీంతోపాటు రైతులు వర్షాలు ఎప్పుడు వస్తాయో అంచనా వేయడానికి ఈ మృగశిర కార్తెను వర్షాకాలానికి నాందిగా భావిస్తారు. విత్తనాలు వేయడానికి ఈ కార్తె సరైన సమయంగా రైతులు భావిస్తూ పంటల పనులను ఈ కార్తెను ఆధారంగా చేసుకుని ప్రారంభించుకుంటారు. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో మృగశిర కార్తె సందర్భంగా ప్రత్యేకంగా దేవాలయాలకు వెళ్లి ఉపవాస ప్రార్థనలు చేస్తారు. మరికొన్నిచోట్ల కొందరు చేపతో ఇచ్చే చేప మందును ఆహారంగా తీసుకుంటారు.

Next Story