కూరగాయలు అమ్మేందుకు మార్కెట్‌కు వెళ్లిన రైతుకు ఊహించని షాక్

by Jakkula.Mamatha |

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని పెర్కిట్ కూరగాయల మార్కెట్‌లో రైతు అల్లూరి పెద్ద భూమన్నకు ఊహించని షాక్ ఎదురైంది.

కూరగాయలు అమ్మేందుకు మార్కెట్‌కు వెళ్లిన రైతుకు ఊహించని షాక్
X

దిశ, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని పెర్కిట్ కూరగాయల మార్కెట్‌లో రైతు అల్లూరి పెద్ద భూమన్నకు చెందిన ఏపీ 25 ఏజి 3805 నెంబరు గల ఫ్యాషన్ ప్రో మోటార్ సైకిల్(బైక్) ఆదివారం ఉదయం అదృశ్యమైంది. రైతు అల్లూరి పెద్ద భూమన్న వారి వ్యవసాయ క్షేత్రం నుంచి కూరగాయలు తెంపుకొని పెర్కిట్ చౌరస్తాలో గల మార్కెట్‌లో అమ్మేందుకు కూరగాయలు తీసుకొని మార్కెట్‌కు వచ్చాడు. కూరగాయలను మార్కెట్‌లో రైతు అల్లూరి పెద్ద భూమన్న వారి సతీమణి అల్లూరి చిన్ను భాయ్ దగ్గర పెట్టి వచ్చేవరకు మార్కెట్లో పెట్టిన బైక్ అదృశ్యమైంది.

కూరగాయల మార్కెట్‌లో గుర్తుతెలియని దొంగల తాకిడి ఎక్కువైందని రైతుల కోసం మార్కెట్లో పోలీసులు నిఘా పెంచి దొంగల ఆట కట్టించాలని వ్యవసాయ మార్కెట్‌లో గల రైతులు కోరారు. రైతు అల్లూరి పెద్ద భూమన్న వారి వ్యవసాయ క్షేత్రంలో పెట్టుకున్న కూరగాయలను తెంపుకొని మార్కెట్లో అమ్మేందుకు మార్కెట్‌కు వెళ్తే మార్కెట్‌లో గుర్తు తెలియని దుండగులు ఆ రైతు బైక్‌ను ఎత్తుకెళ్లారు. దీంతో ఆ రైతు తీవ్ర నిరాశకు గురై పోలీసులు బైక్‌ను ఎత్తుకెళ్లిన వ్యక్తులను గుర్తించి బైక్‌ను ఇప్పించాలని కోరారు. అదృష్టమైన బైక్ ఆచూకీ ఎవరికైనా తెలిస్తే, ఆ బైక్ కనిపిస్తే ఈ క్రింది ఫోన్ 9848590589 నెంబర్‌కు సమాచారం అందించాలని రైతు అల్లూరి పెద్ద భూమన్న కోరారు.

Next Story