- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందమర్రి టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా.. సురక్షితంగా బయటపడ్డ ఒక్క ప్రయాణికుడు
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సింగరేణి కేకే మైన్ ఓపెన్ కాస్ట్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన వెలుగు చూసింది.

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సింగరేణి కేకే మైన్ ఓపెన్ కాస్ట్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కొత్తగూడెం నుంచి బెల్లంపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో టోల్ ప్లాజా వద్ద డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. బస్సులో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ఒక్కడే ప్రయాణికుడు ఉండడంతో స్థానిక ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాదానికి బస్సు అతివేగమే కారణమా..? లేక డ్రైవర్ నిద్రలోకి జారుకోవడమే కారణమా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్వల్ప గాయాలైన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు సురక్షితంగా ఉన్నాడు. బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందన్నారు. టోల్ ప్లాజా సిబ్బంది బోల్తా పడిన బస్సును పక్కకు తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన తీరుపై సంబంధిత అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






