విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వేసవి సెలవులు పొడిగింపు

by Malleboina Mahesh |

తెలంగాణలో స్కూళ్ల రీఓపెనింగ్ తేదీలు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 15 నుంచి పాఠశాలు ప్రారంభం కానున్నాయి.

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వేసవి సెలవులు పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా.. వేసవి సెలవులను ప్రభుత్వం పొడిగించింది. జూన్ 12న పాఠశాలలు తెరిచినప్పటికీ, ఆ మరుసటి రోజైన జూన్ 13వ తేదీన రెండో శనివారం (సెకండ్ సాటర్‌డే) వస్తోంది. అలాగే జూన్ 14న ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు సెలవులు వస్తున్నాయి. ఒక రోజు స్కూల్ తెరిచి మళ్లీ రెండు రోజులు సెలవులు ఇవ్వడం కంటే, ఈ సెలవులు ముగిసిన తర్వాత సోమవారం (జూన్ 15) నుంచే పూర్తి స్థాయిలో పాఠశాలలను పునఃప్రారంభించడం ఉత్తమమని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

జులై 11న వర్కింగ్ డే..

జూన్ 13న రాబోయే రెండో శనివారం సెలవును విద్యార్థులకు ముందే ఇస్తున్నందున, దానికి బదులుగా జులై 11న వచ్చే రెండో శనివారాన్ని పాఠశాలలకు పనిదినం (వర్కింగ్ డే) గా పరిగణిస్తామని ప్రభుత్వం తన ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో విద్యార్థులకు మరో మూడు రోజులు అదనంగా సెలవులు లభించినట్లయింది.

Next Story