- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > వరంగల్ > బీఆర్ఎస్ పాలనలో ఆటో కార్మికులకు స్వర్ణయుగం : ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్
బీఆర్ఎస్ పాలనలో ఆటో కార్మికులకు స్వర్ణయుగం : ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు కేసీఆర్ పాలనలో ఆటో కార్మికులకు స్వర్ణ యుగం నడిచిందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.

X
దిశ, హనుమకొండ కలెక్టరేట్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు కేసీఆర్ పాలనలో ఆటో కార్మికులకు స్వర్ణ యుగం నడిచిందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వినయ్ భాస్కర్ మాట్లాడుతూ 420 హామీలు, 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పి ఆటో కార్మికుల పొట్ట కొట్టిందని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో కార్మికులకు రూ.5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించి 77 కోట్ల రూపాయల రవాణా టాక్స్ రద్దు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.12 వేలు ఆటో కార్మికులకు అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడికి వెళ్లి ఆటోలలో తిరుగుతూ పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ ఆటో కార్మికుల స్థితిగతులపై ఆలోచించడం లేదని అన్నారు. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని దాని కోసం పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో సమావేశాలు ఏర్పాటు చేసి వారి స్థితిగతులపై చర్చిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బిఆర్ఎస్ ఇన్ చార్జి పులి రజినీకాంత్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.
Next Story






