‘దిశ’ కథనానికి స్పందన

by Jakkula.Mamatha |

వ్యవసాయ శాఖ భవనం కూలిపోయే వరకు స్పందించరా? అనే వార్త ‘దిశ’ వెబ్‌సైట్‌లో రావడంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దినసరి పుల్లయ్య స్పందించారు.

‘దిశ’ కథనానికి స్పందన
X

దిశ, ఏన్కూర్: వ్యవసాయ శాఖ భవనం కూలిపోయే వరకు స్పందించరా? అనే వార్త ‘దిశ’ వెబ్‌సైట్‌లో రావడంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దినసరి పుల్లయ్య స్పందించారు. ఈ క్రమంలో ‘దిశ’ విలేఖరితో మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ భవనం శిథిలావస్థలో ఉన్న విషయం ‘దిశ’లో చూడటం జరిగిందని, ఆ భవనం తొలగించాలా? వద్దా? అనే విషయం సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులు పరిశీలించి వారి ఇచ్చిన నివేదిక ప్రకారం, తొలగించాలని రిపోర్టులో రాయడం జరిగితే తక్షణమే జిల్లా కలెక్టర్‌కి ఫైల్ పెట్టి భవనం తొలగించడం జరుగుతుందని, భవనం కండిషన్ గా ఉందని ఇంజనీరింగ్ అధికారులు రిపోర్ట్ ఇస్తే మరో శాఖకు అప్పజెప్పడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య తెలిపారు.

Next Story