హీరోలకు, హీరోయిన్లకు ఉన్న తేడాపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

by Pulgam srinivas |

పెరిగిన నా వయసు వల్ల రొమాంటిక్, గ్లామర్ పాత్రలకు నేను సెట్ కాదని అంటున్నారు. కానీ హీరోల విషయంలో మాత్రం అలాంటి తేడాలు కనిపించవని తాప్సీ వ్యాఖ్యానించింది.

హీరోలకు, హీరోయిన్లకు ఉన్న తేడాపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: సొట్టబుగ్గల సుందరి తాప్సీ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఈమె బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడ అనేక చిత్రాల్లో నటిస్తూ ప్రస్తుతం విజయవంతంగా కెరీర్‌ను కొనసాగిస్తోంది. తాజాగా తాప్సీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “గత కొంతకాలంగా నేను సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాను. దానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు.

కానీ సోషల్ మీడియా అనేది పరుగు పందెంలా మారిపోయింది. అందుకే కొంతకాలం దానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను” అని తెలిపింది. అలాగే, “నేను దాదాపు 25 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చాను. మొదట్లో పెద్దగా అవకాశాలు రాలేదు. నాకంటూ ఒక గుర్తింపు రావడానికి నాలుగు, ఐదు సంవత్సరాలు పట్టింది. అప్పటికి నాకు 30 ఏళ్లు వచ్చాయి. ఇప్పుడు రొమాంటిక్, గ్లామర్ పాత్రలకు నా వయసు సరిపోదని అంటున్నారు. కానీ హీరోల విషయంలో మాత్రం ఇలాంటి తేడాలు కనిపించవు” అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం తాప్సీ ‘గాంధారి’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Next Story