బాలయ్య సినిమాలో రాజశేఖర్.. అసలు కొరటాల ప్లాన్ ఏంటి?

by Pulgam srinivas |

బాలకృష్ణ - కొరటాల శివ కాంబో మూవీలో సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

బాలయ్య సినిమాలో రాజశేఖర్.. అసలు కొరటాల ప్లాన్ ఏంటి?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మూవీ బృందం ఆయనను సంప్రదించగా, రాజశేఖర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

అన్నీ అనుకూలంగా జరిగితే ఈ విషయంపై అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాజశేఖర్ ప్రస్తుతం ‘రౌడీ జనార్ధన’ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇదే సమయంలో బాలకృష్ణ-కొరటాల శివ కాంబో మూవీలో కూడా ఆయన భాగం కానున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రాజశేఖర్ వంటి మంచి క్రేజ్ ఉన్న నటుడు ఈ ప్రాజెక్ట్‌లో చేరితే ఆ అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story