- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల రెండో కనుమ దారిలో ఎలుగుబంటి సంచారం
తిరుమల తిరుపతిలోని రెండో కనుమ దారిలోని వినాయక ఆలయం వద్ద శనివారం రాత్రి ఎలుగుబంటి సంచరించడం కలకలం రేపింది.

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి కొండపై మరోసారి వన్యప్రాణుల సంచారం మరోసారి కలకలం రేపింది. శనివారం రాత్రి తిరుమల రెండో కనుమ దారిలో ఒక ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. కనుమ దారి లోని శ్రీ వినాయక స్వామి ఆలయం సమీపంలో ఈ ఎలుగుబంటి సంచరించినట్లు స్థానికులు, భక్తులు గుర్తించారు. రోడ్డు పక్కన ఉన్న చెత్త కుండీల (డస్ట్‌బిన్స్) వద్ద ఆహారం, తినుబండారాల కోసం ఆ ఎలుగుబంటి వెతుకులాడుతూ కనిపించింది. ఘాట్ రోడ్డు గుండా వాహనాల్లో వెళ్తున్న భక్తులు ఆ ఎలుగుబంటిని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వెంటనే అప్రమత్తమైన కొందరు భక్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. తిరుమల అడవుల నుంచి వన్యప్రాణులు తరచూ కనుమ దారులు, కాలినడక మార్గాల్లోకి వస్తుండటంతో.. రాత్రి సమయాల్లో ఘాట్ రోడ్డు ప్రయాణికులు, కాలినడకన వెళ్లే భక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రాంతంలో భక్తుల రక్షణ కోసం అటవీ సిబ్బంది నిఘాను పెంచినట్లు తెలుస్తోంది.






