నాసిరకం విత్తనాలు రైతులకు సరఫరా చేస్తే షాపులు సీజ్:డీఏవో

by Jakkula.Mamatha |

మండల కేంద్రంలోని ఎరువుల విక్రయ దుకాణాలను తనిఖీ చేసిన డీఏవో సక్రియ నాయక్ ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, బిల్ పుస్తకాలు, విక్రయ రికార్డులు మరియు వ్యవసాయ శాఖకు సంబంధించిన ఇతర రికార్డులను పరిశీలించారు.

నాసిరకం విత్తనాలు రైతులకు సరఫరా చేస్తే షాపులు సీజ్:డీఏవో
X

దిశ,నర్వ: మండల కేంద్రంలోని ఎరువుల విక్రయ దుకాణాలను తనిఖీ చేసిన డీఏవో సక్రియ నాయక్ ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, బిల్ పుస్తకాలు, విక్రయ రికార్డులు మరియు వ్యవసాయ శాఖకు సంబంధించిన ఇతర రికార్డులను పరిశీలించారు. రైతులకు అవసరమైన ఎరువులు తగినంతగా అందుబాటులో ఉంచాలని, విక్రయాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్నటువంటి రేట్లు రైతులకు విక్రయించాలని డీలర్లకు సూచించారు. అలాగే రికార్డులు ఎప్పటికప్పుడు ధృవీకరించి, తనిఖీల సమయంలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి అఖిల రెడ్డి రైతులు పాల్గొన్నారు.

Next Story