శిథిలావస్థలో వ్యవసాయ శాఖ కార్యాలయం

by Jakkula.Mamatha |

మండల కేంద్రంలో స్థానిక వ్యవసాయ శాఖ అధికారి భవనం శిథిలావస్థకు చేరి సుమారు ఐదు సంవత్సరాలవుతుంది.

శిథిలావస్థలో వ్యవసాయ శాఖ కార్యాలయం
X

దిశ, ఏన్కూరు: మండల కేంద్రంలో స్థానిక వ్యవసాయ శాఖ అధికారి భవనం శిథిలావస్థకు చేరి సుమారు ఐదు సంవత్సరాలవుతుంది. అది ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వాటిని తక్షణమే తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ నేటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కలెక్టర్ ఆదేశాలనే పట్టించుకునే పరిస్థితిలో అధికారులు లేరా అని ప్రశ్న తలెత్తుతుంది. నిత్యం వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు తమ అవసరాల నిమిత్తం వచ్చి పోతుంటారు.

శిథిలావస్థలో ఉన్న భవనాలు కూలిపోయి ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా గత 60 సంవత్సరాల క్రితం ఏన్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కార్యకలాపాలు నిర్వహించి.. నేడు శిథిలావస్థకు చేరి కూలి పోయేందుకు సిద్ధంగా ఉంది. ఈ భవనాలను తక్షణమే తొలగించాలని ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని అంతు పట్టని ప్రశ్న ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రమాదం జరగకముందే శిథిలావస్థలో ఉన్న భవనాలను తక్షణమే తొలగించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Next Story