బీఆర్ఎస్ నేత సురేశ్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ.. ఏకంగా రూ.కోటిన్నర అపహరణ

by Kema Shiva Kumar |

హైదరాబాద్ నగర పరిధిలోని సనత్ నగర్ జెడ్ కాలనీలో భారీ చోరీ కలకలం రేపింది.

బీఆర్ఎస్ నేత సురేశ్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ.. ఏకంగా రూ.కోటిన్నర అపహరణ
X

దిశ, వెబ్‌డెస్క్: మహానగరంలో నిత్యం రద్దీగా ఉండి, అత్యంత పటిష్టమైన భద్రత ఉండే వీఐపీల ఇళ్లలోకు దొంగలు కన్నాలు వేస్తున్నారు. తాజాగా సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెడ్ కాలనీలో శనివారం భారీ చోరీ వెలుగుచూసింది. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి నివాసంలో అపరిచిత వ్యక్తులు చొరబడి భారీ మొత్తంలో నగదు, విలువైన వస్తువులను అపహరించుకుపోయారు.

రూ.కోటిన్నర అపహరణ..

పోలీసు కథనం మేరకు.. గుర్తుతెలియని దుండగులు సురేశ్ రెడ్డి ఇంట్లోకి చొరబడి సుమారు రూ. కోటిన్నర విలువైన నగదు, ఇతర సొత్తును దొంగిలించారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. పక్కా స్కెచ్ ప్రకారమే ఈ చోరీకి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. దొంగతనం జరిగిన విషయాన్ని గమనించిన వెంటనే ఆయన సనత్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో స్పాట్‌కు హుటాహటిన చేరుకుని కీలక ఆధారాలు సేకరించారు. అనంతరం జెడ్ కాలనీలో ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Next Story