నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థిని

by Jakkula.Mamatha |

ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పసునూరి దివ్యజ్యోతి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్‌కు(ఎన్ఎంఎంఎస్) ఎంపికైంది.

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థిని
X

దిశ, ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పసునూరి దివ్యజ్యోతి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్‌కు(ఎన్ఎంఎంఎస్) ఎంపికైంది. శనివారం ప్రకటించిన ఫలితాల్లో ఈ విద్యార్థినికి ప్రతి సంవత్సరం రూ.12,000 స్కాలర్షిప్ నగదు బహుమతి ప్రభుత్వం నుంచి అందుతుంది. స్థానిక గ్రామ సర్పంచ్ ఎనగందుల నర్సింలు ఉపసర్పంచ్ బందారపు బాల్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు మనోహర చార్యులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గెంటి లత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినిని అభినందించారు.

Next Story