అరుణాచలం వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి నేరుగా రైళ్లు

by Malleboina Mahesh |   (  Updated:2026-06-07 04:32:57  IST  )

దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి టెర్మినల్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక, రెగ్యులర్ రైళ్లను ప్రారంభించింది.

అరుణాచలం వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి నేరుగా రైళ్లు
X

దిశ, వెబ్ డెస్క్: గత కొంత కాలంగా తమిళనాడులోని అరుణాచలం(తిరువన్నామలై)కి తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వేలాది మంది భక్తులు వెళ్తున్నారు.పెరుగుతున్న పని ఒత్తిడిని తట్టుకునేందుకు నేటి యువత ఆధ్యాత్మికం వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి వీకెండ్ అరుణాచలం వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో భారతీయ రైల్వే తీసుకున్న నిర్ణయం హైదరాబాద్‌లోని తూర్పు ప్రాంత (ఈస్ట్ హైదరాబాద్) భక్తులకు శుభవార్తను అందించింది. దక్షిణ మధ్య రైల్వే (SCR) కొత్తగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ప్రముఖ శైవ క్షేత్రమైన అరుణాచలం (తిరువణ్ణామలై) వైపు ప్రత్యేక, రెగ్యులర్ రైళ్లను రైల్వే శాఖ ప్రారంభించింది. దీనివల్ల గిరిప్రదక్షిణ కోసం అరుణాచలం వెళ్లే భక్తులకు ఎంతో లబ్ధి చేకూరనుంది.

గతంలో హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్లాలనుకునే భక్తులు తిరుపతి, చెన్నై మీదుగా రైళ్లు మారి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చర్లపల్లి నుంచి నేరుగా రైలు సర్వీసులు ప్రారంభం కావడంతో భక్తులకు ఆ తిప్పలు తప్పాయి. దీనివల్ల ప్రయాణ సమయం తో పాటు అటు ఖర్చు కూడా గణనీయంగా తగ్గిందని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సరికొత్త రైలు సర్వీసుల వల్ల సికింద్రాబాద్, కాచిగూడ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల ఒత్తిడి చాలా వరకు తగ్గనుంది. ముఖ్యంగా ఉప్పల్, ఎల్‌బీనగర్, మల్కాజ్‌గిరి, చర్లపల్లి పరిసర ప్రాంతాల్లోని ఈస్ట్ హైదరాబాద్ భక్తులకు అరుణాచలం ఆధ్యాత్మిక యాత్రలు ఇకపై మరింత సులభతరం, సౌకర్యవంతం కానున్నాయి.

Next Story