షార్ట్ సర్క్యూట్‌తో ఆయిల్ పామ్ తోట దగ్ధం

by Jakkula.Mamatha |

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో షార్ట్ సర్క్యూట్‌తో ఆయిల్ పామ్ తోట దగ్ధమైన ఘటన చోటు చేసుకుంది.

షార్ట్ సర్క్యూట్‌తో ఆయిల్ పామ్ తోట దగ్ధం
X

దిశ, టేకుమట్ల(మొగుళ్లపల్లి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో షార్ట్ సర్క్యూట్‌తో ఆయిల్ పామ్ తోట దగ్ధమైన ఘటన చోటు చేసుకుంది. రంగాపురం గ్రామానికి చెందిన సూర్యనేని దేవేందర్రావు అనే రైతు బావి వద్ద ఉన్న స్తంభానికి విద్యుత్ వైర్లు తెగి నేలపై పడడంతో మంటలు చెలరేగి పక్కనే ఉన్న రైతు పోల్నేని లింగారావు యొక్క ఆయిల్ పామ్ తోటలోకి మంటలు వ్యాపించడంతో పూర్తిగా కాలిపోయింది. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోలేదు. చేతికందే వచ్చిన సమయంలో ఏడెకరాల ఆయిల్ పామ్ తోట కాలిపోవడంతో రైతు కన్నీటి పర్యంతమయ్యారు. రైతు పోలినేని దేవేందర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయిల్ పామ్ తోటలో ఉన్నటువంటి డ్రిప్పు పైపులు, రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Next Story