- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నాగబంధం’ ప్రమోషన్స్‌కు పక్కా ప్లాన్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ మూవీ ప్రమోషన్స్‌ను భారీగా నిర్వహించేందుకు చిత్ర బృందం ‘ది ఎపిక్ బిగిన్స్ టూర్’ పేరుతో ప్రత్యేక షెడ్యూల్‌ను ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. జూలై 3న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్లను భారీ స్థాయిలో నిర్వహించేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. తాజాగా ‘ది ఎపిక్ బిగిన్స్ టూర్’ పేరుతో ప్రత్యేక ప్రమోషనల్ షెడ్యూల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ టూర్‌లో భాగంగా జూన్ 10న సినిమా సెన్సార్ కార్యక్రమం జరగనుండగా, జూన్ 19న హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
అనంతరం జూన్ 20న ముంబై, జూన్ 21న చెన్నై, జూన్ 22న బెంగళూరు, జూన్ 23న కొచ్చిన్‌లో ప్రత్యేక ప్రమోషనల్ ఈవెంట్లు జరగనున్నాయి. అలాగే జూన్ 26న వారణాసిలో ‘వీర నాగ’ సాంగ్ లాంచ్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఇక జూన్ 28న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్, జూలై 2న ప్రీమియర్ షో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను అభిషేక్ నామా నిర్వహిస్తుండగా, కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భారీ అంచనాల నడుమ విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.






