- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లైఫ్ లాంగ్ సింగిల్‌గా ఉంటా : త్రిష
<p>దిశ, వెబ్ డెస్క్: స్మైలింగ్ స్టార్ త్రిష కృష్ణన్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. 37 ఏళ్ల వయస్సుకు చేరుకున్న భామ త్వరగా పెళ్లి చేసుకుంటే చూడాలని కోరుకుంటున్నారు. గతంలో ఓ పారిశ్రామికవేత్తతో నిశ్చితార్థం జరిగినా .. మ్యారేజ్ కాస్త క్యాన్సిల్ అయింది. ఈ మధ్య త్రిష, శింబులకు పెళ్లి అంటూ కోలీవుడ్‌లో హడావిడి జరిగింది. కానీ ఇదంతా అపోహ అని క్లారిటీ ఇచ్చింది భామ. తనను అర్ధం చేసుకునే వ్యక్తి దొరికితే ఖచ్చితంగా పెళ్లి […]</p>

దిశ, వెబ్ డెస్క్: స్మైలింగ్ స్టార్ త్రిష కృష్ణన్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. 37 ఏళ్ల వయస్సుకు చేరుకున్న భామ త్వరగా పెళ్లి చేసుకుంటే చూడాలని కోరుకుంటున్నారు. గతంలో ఓ పారిశ్రామికవేత్తతో నిశ్చితార్థం జరిగినా .. మ్యారేజ్ కాస్త క్యాన్సిల్ అయింది. ఈ మధ్య త్రిష, శింబులకు పెళ్లి అంటూ కోలీవుడ్‌లో హడావిడి జరిగింది. కానీ ఇదంతా అపోహ అని క్లారిటీ ఇచ్చింది భామ. తనను అర్ధం చేసుకునే వ్యక్తి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని తెలిపింది. కానీ అలాంటి వ్యక్తి దొరికే వరకు సింగిల్‌గానే ఉంటానని.. లేదంటే లైఫ్ లాంగ్ సింగిల్‌గానే మిగిలిపోతానంది. దీంతో గత కొద్దిరోజులుగా త్రిష, శింబుకు పెళ్లి అన్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.
కాగా కోలీవుడ్, టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన త్రిష.. ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌పై కాన్సంట్రేట్ చేసింది. మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్న భామ.. దీంతో పాటు మరో నాలుగు తమిళ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు సమాచారం.






