- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సహోద్యోగి కాల్పుల్లో ఇద్దరు జవాన్ల మృతి..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: త్రిపురలో దారుణం చోటుచేసుకుంది. త్రిపుర రాష్ట్ర రైఫిల్స్‌కు చెందిన జవాను తోటి ఉద్యోగులపై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఇద్దరు సహోద్యోగులు మరణించారు. త్రిపురలోని సెఫజలా జిల్లా పరిధిలోని మధుపూర్, కోనబన్‌లో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా త్రిపుర పోలీసు డిపార్ట్‌మెంట్(టీపీడీ) 5వ బెటాలియన్‌కు చెందిన జవాన్లని చెప్పారు. సంఘటన తర్వాత కాల్పులకు పాల్పడిన జవాన్ పోలీసు స్టేషన్లో ఆయుధాలతో సహా లొంగిపోయాడని వెల్లడించారు. ఈ ఘటనపై […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: త్రిపురలో దారుణం చోటుచేసుకుంది. త్రిపుర రాష్ట్ర రైఫిల్స్‌కు చెందిన జవాను తోటి ఉద్యోగులపై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఇద్దరు సహోద్యోగులు మరణించారు. త్రిపురలోని సెఫజలా జిల్లా పరిధిలోని మధుపూర్, కోనబన్‌లో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా త్రిపుర పోలీసు డిపార్ట్‌మెంట్(టీపీడీ) 5వ బెటాలియన్‌కు చెందిన జవాన్లని చెప్పారు. సంఘటన తర్వాత కాల్పులకు పాల్పడిన జవాన్ పోలీసు స్టేషన్లో ఆయుధాలతో సహా లొంగిపోయాడని వెల్లడించారు. ఈ ఘటనపై త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్‌దేవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన జవాన్ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు టీపీడీ అధికారులు తెలిపారు.
Next Story






