ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో సంచలనం.. ప్రిన్సిపల్‌గా ఆదివాసీ మహిళ

by  |
Tribal Woman, gummadi anuradha
X

దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పీజీ లా కాలేజీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ గుమ్మడి అనురాధ నియమితులయ్యారు. బషీర్‌బాగ్‌లోని పీజీ లా కాలేజీ ప్రిన్సిపల్‌గా ఆమెను నియమిస్తూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం మధ్యాహ్నం ఆమె ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆమె సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూతురు కావడం విశేషం. అయితే.. ఓయూలోనే పీజీతో పాటు లా కోర్సులు పూర్తి చేసిన అనురాధ, ఓయూ లా విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం టేకులగూడెంలో ఆమె జన్మించారు. ఆమె తండ్రి గుమ్మడి నర్సయ్య ఇల్లందు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సాధారణ జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల చరిత్రలో తొలిసారి ఒక ఆదివాసీ (కోయ) మహిళ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు.

Tribal Woman, gummadi anuradha


Next Story

Most Viewed