అంబులెన్స్ ముందు గిరిజనుల ఆందోళన

by  |
tandoor1
X

దిశ, తాండూర్: అంబులెన్స్ ముందు గిరిజనులు ఆందోళన నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని నర్సాపూర్ గిరిజన గ్రామానికి చెందిన కుడిమేత రాంబాయి అనే గిరిజన మహిళ ఐదు నెలల గర్భవతి. మంగళవారం నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. గ్రామానికి అంబులెన్స్ వచ్చే లోపే ఆ గర్భిణీ ప్రసవించడంతో మృత శిశువు పుట్టింది. గర్భిణి రాంబాయికి ఈ నెల 6న ఆరోగ్య సిబ్బంది కోవిడ్ టీకా వేయడం వల్లనే ఈ విధంగా అయ్యిందని భీంరావు, తుడుం దెబ్బ మండల కమిటీ అధ్యక్షులు కుర్సింగ బాబురావు, ఆమె బంధువులు ఆరోపించారు. గ్రామానికి వచ్చిన అంబులెన్స్ ముందు గిరిజనులు బైటాయించి ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు స్పందించి రాంబాయికి మెరుగైన వైద్య చికిత్స అందించి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మాదారం ఎస్ఐ మానస గ్రామానికి చేరుకుని గిరిజనులకు నచ్చజెప్పారు. మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లో రాంబాయిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tandoor-3

Tandoor-2Next Story