సర్కారు భూమిలో ఎర్రజెండాలు

by Sridhar Babu |   (  Updated:2025-08-29 16:59:22  IST  )

<p>దిశ, భద్రాచలం : చర్ల మండలంలో ఎంపీపల్లి చెక్కులో గల సర్వే నంబర్ 46/1 లో 2.38 ఎకరాల ప్రభుత్వ 2ఏ భూమిలో సోమవారం ఉదయం సీపీఐ నాయకుల అండతో ఆదివాసీ గిరిజనులు ఎర్రజెండాలు పాతి గుడిసెలు వేసుకున్నారు. చర్ల నుంచి వెంకటాపురం వెళ్ళే ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న ఈ 2ఏ భూమిని ఇళ్ళ స్థలాలులేని పేద గిరిజనులకు పంచాలని అనేకసార్లు అధికారులకు దరఖాస్తు చేసినా ఫలితం లేదు. దీంతో ఇళ్ళ స్థలాల కోసం ప్రధాన […]</p>

సర్కారు భూమిలో ఎర్రజెండాలు
X

దిశ, భద్రాచలం : చర్ల మండలంలో ఎంపీపల్లి చెక్కులో గల సర్వే నంబర్ 46/1 లో 2.38 ఎకరాల ప్రభుత్వ 2ఏ భూమిలో సోమవారం ఉదయం సీపీఐ నాయకుల అండతో ఆదివాసీ గిరిజనులు ఎర్రజెండాలు పాతి గుడిసెలు వేసుకున్నారు. చర్ల నుంచి వెంకటాపురం వెళ్ళే ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న ఈ 2ఏ భూమిని ఇళ్ళ స్థలాలులేని పేద గిరిజనులకు పంచాలని అనేకసార్లు అధికారులకు దరఖాస్తు చేసినా ఫలితం లేదు. దీంతో ఇళ్ళ స్థలాల కోసం ప్రధాన రహదారి ప్రక్కన ప్రభుత్వ భూమిని పేదలు ఆక్రమించారు.

అయితే ఆ భూమికి ఎక్కువ ధర ఉడడంతో దాని పై అధికార పార్టీకి చెందిన గిరిజనేతర నాయకుడి కన్నుపడింది. గిజనుడి సహాయంతో ఆ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నించాడు. అది తెలిసిన ఆదివాసీలు ఆ భూమిలో ఎర్రజెండాలు పాతి భూపోరాటం ప్రారంభించారు. ఈ పోరాటంలో కత్తిగూడెం, కొయ్యూరు, ఉప్పరిగూడెం, గన్నారం గ్రామాలకు చెందిన సుమారు వంద కుటుంబాలు పాల్గొన్నాయి. ఈ పోరాటానికి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు, జిల్లా నాయకుడు అడ్డగర్ల తాతాజీ, మండల నాయకుడు కొంగూరు రాము, గిరిజన నాయకుడు దుబ్బా రాజు నాయకత్వం వహిస్తున్నారు.

Click For Video..

Next Story