- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిడుగుపాటుకు గిరిజన రైతు మృతి
by Shyam |
<p>దిశ, డోర్నకల్: వ్యవసాయం క్షేత్రంలో పిడుగుపాటుకు గురై గిరిజన రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన రేకులతండా (కె) గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు ధరాసింగ్ (64) వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. అప్పటికే భారీ వర్షం కురవడంతో ఆ రైతు తిరుగు పయనమయ్యాడు. ఇంటికి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పిడుగుపడి రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం […]</p>

X
దిశ, డోర్నకల్: వ్యవసాయం క్షేత్రంలో పిడుగుపాటుకు గురై గిరిజన రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన రేకులతండా (కె) గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు ధరాసింగ్ (64) వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. అప్పటికే భారీ వర్షం కురవడంతో ఆ రైతు తిరుగు పయనమయ్యాడు.
ఇంటికి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పిడుగుపడి రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
Next Story






