- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Zomato: మటన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే, కుక్క కాలు పంపారు..!
Zomato: మటన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే, కుక్క కాలు అందులో పంపారని ఓ వ్యక్తి వీడియో తీసి వైరల్ చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో ఫుడ్ డెలివరీ వాడకం విపరీతంగా పెరిగింది. ఆకలైతే చాలు.. వెంటనే ఫోన్ తీస్తున్నారు, ఆన్లైన్ లో సెర్చ్ చేసి ఆర్డర్ పెట్టుకుంటున్నారు. డిస్కౌంట్ చూసి మరీ, ఫుడ్ బుక్ చేసుకుంటున్నారు జనాలు. చికెన్ లేదా మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తినేస్తున్నారు. జొమాటో లేదా స్విగ్గిలో ఆర్డర్ చేస్తే ఆఫర్లు కూడా వస్తాయి. వాటిని కూడా వినియోగించుకొని ఫుడ్ బుకింగ్ చేసుకుంటున్నారు జనాలు.
అయితే ఆన్లైన్ లో మనం ఆర్డర్ చేసినప్పుడు ఒక ఐటెం చూపించి.. పంపేటప్పుడు మరో ఐటెం పంపించడం ఈ మధ్య జరుగుతోంది. హైదరాబాద్ లాంటి మహా నగరాలలో ఇలాంటి సంఘటనలు చాలా సర్వ సాధారణం. అయితే లేటెస్ట్ గా ఇలాంటి సంఘటన కాన్పూర్ లో కూడా చోటు చేసుకుంది. మటన్ బిర్యానీ పెడితే, ఏకంగా కుక్క కాలు మాంసం పంపించారని ఓ కస్టమర్ గొడవకు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
కుక్క కాలు పంపారని వివాదం !
కాన్పూర్ లో జొమాటో ద్వారా ఓ వ్యక్తి మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాడు. అయితే ఆ ప్రముఖ రెస్టారెంట్ మటన్ పంపించకుండా కుక్క కాలు ఆకారంలో ఉన్న ముక్కలతో ఇప్పుడే బిర్యానీ పంపించింది. దీంతో బుక్ చేసుకున్న కస్టమర్, ఈ బిర్యాని కి సంబంధించిన వీడియోలు క్యాప్చర్ చేసి.. తనకు కుక్క బిర్యానీ పంపించాడని రచ్చ రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఇది కుక్క బిర్యానినా? లేక మటన్ బిర్యానినా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది.






