- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్‌పై నిషేధం.. జులై 22 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి !
యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్‌పై నిషేధం..! జులై 22 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి !

దిశ, ఫీచర్స్ : మోస్ట్ పవర్ ఫుల్ క్యమూనికేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన యూట్యూబ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. జులై 22 నుంచి ఇవి అమలులోకి వస్తాయని ప్రకటించింది. అందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కొత్త రూల్స్ ప్రకారం 16 సంవత్సరాలకంటే తక్కువ ఏజ్ గల యూజర్లు, సబ్ స్ర్కైబర్లు ఇక నుంచి ఒంటరిగా లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి అనుమతి ఉండదు. ఒక వేళ 13 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు గల యూత్ కంటెంట్ క్రియేటర్స్ లైవ్ స్ట్రీమింగ్ చేయాలంటే, వారితో పాటు ఒకరు మేజర్ (Adult) కచ్చితంగా పక్కన ఉండాల్సిందే. లైవ్‌లో కూడా కనిపించాలి. ఆన్‌లైన్‌లో చిన్నారులు, మైనర్లు ఎదుర్కొంటున్న వేధింపులు, బెదిరింపులు, అనుచిత కంటెంట్‌కు గురికావడంవంటి ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో వారి సేఫ్టీకోసం ఈ నిబంధనలు అమలు చేయనున్నట్లు యూట్యూబ్ స్పష్టం చేసింది.






